నెల్లూరు లో దారుణం… యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో దారుణం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ని కాలేజీ మిట్ట వద్ద ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంటర్ విద్యార్థిని చిగురుపాటి జ్యోతిక అనే యువతి గొంతుకోశాడు. ఈ ఘటన కాసేపటి క్రితమే చోటు చేసుకుంది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నెల్లూరు జిల్లాకు చెందిన చెంచు కృష్ణ అనే యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా… జ్యోతిక ను ప్రేమిస్తున్నానని.. వేధిస్తున్నాడు. తరచూ ఆమె కాలేజ్ దగ్గరికి వెళ్లి.. ప్రేమించమని… వేధించే వాడు. అయినప్పటికీ జ్యోతిక నిరాకరించింది.

దీంతో చేసేదేమీ లేక పీకలదాకా తాగిన… చెంచు కృష్ణ.. ఇవాళ జ్యోతిక గొంతు కోశాడు. ఇక అక్కడే ఉన్న స్థానికులు అతనిని… కొట్టి జ్యోతిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జ్యోతిక… నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇక అటు చెంచు కృష్ణ ను పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version