ఈ పెళ్లి నాకొద్దు.. తాళి కట్టే ముందు ఫస్ట్ ఇచ్చిన యువతి.. వైరల్ వీడియో..!

-

ఇక్కడ ఓ యువతి యువకుడిని ప్రేమించింది. కానీ అంతలోనే తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూడటంతో.. ప్రేమ విషయం చెబితే ఏం జరుగుతుందో అని భయపడి పోయింది. ఇక అన్నిటికీ ఇష్టమే అన్నట్లుగా సమాధానం చెప్పింది. ఇక చివరికి పెళ్లి వ్యవహారం కాస్త తాళికట్టేంతవరకు వచ్చింది. కానీ సరిగ్గా అదే సమయానికి మాత్రం ధైర్యం చేసి నిజం చెప్పేసింది యువతి. వరుడు తాళి కడుతున్న సమయంలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తన ప్రియుడినే పెళ్లి చేసుకుంటాను అంటూ అందరి ముందు చెప్పేస్తుంది.

ఆసక్తికర ఘటన తమిళనాడులోని చోటు చేసుకుంది. అయితే మరో గంటలో తన ప్రియుడు వస్తాడని ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని పెళ్లి మండపం లో నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఈ క్రమంలోనే అడ్డుకున్న పెద్దలు సదరు యువతికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ యువతి మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. దీంతో పెద్దలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version