మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మాయం ఘటన పై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బియ్యం మాయమైంది నిజమేనని తెలిపారు. డబ్బులు కట్టింది వాస్తవం. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోదాము పెట్టిందెవరు..? చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను మీరు తిట్టలేదా..? మేము ఆడవాళ్లను ఈ కేసులో ఇరికించలేదే..? పేర్ని నాని తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయి. అప్పుడు బూతులు తిట్టి, ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎలా..? అని ప్రశ్నించారు.
మరోవైపు నాగబాబు గురించి మాట్లాడారు. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తాం. నాగబాబు పనిమంతుడా కాదా అనేది ముఖ్యం. నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేశాడు. ఇక్కడ కులం, బంధు ప్రీతి కాదు.. పని మంతుడా కాదా? ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తాం. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారు. మంత్రి అనేది తర్వాత చర్చ చేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.