ఈ పంటకు మార్కెట్‌లో భలే డిమాండ్.. పండిస్తే లాభాలే..!!

-

వ్యవసాయానికి సాంకేతికత జోడిస్తే..లాభాలు పొందవచ్చు. సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల లాభాల మాటామోగానీ.., కష్టం ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య యువత ఉద్యోగాలు వదిలి కొత్త టెక్నాలజీతో సాగువైపు అడుగులేస్తున్నారు. ఈ వృత్తినే వ్యాపారంగా మార్చాలనుకుంటే..లాభాలు ఇచ్చే పంటలు చాలా ఉన్నాయి. మొన్న డ్రాగన్‌ ఫ్రూట్‌ గురించి మాట్లాడుకున్నాం..ఇప్పుడు ఇంకో ఐడియాతో వచ్చేశాం..అదేంటంటే..

ఆహార ఉత్పత్తులు వంటి సంప్రదాయ పంటలను పక్కనబెట్టి.. మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటే పంటను పడిస్తున్నారు. ముఖ్యంగా ఔషధ మొక్కల (Medicinal Plants) పెంపకం ద్వారా అధిక ఆదాయం అర్జిస్తున్నారు. తులసి, కలబంద వంటి ఔషధ గుణాలున్న మొక్కలను సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. స్టీవియా, శతావరి, సర్పగంధ, తులసి, ఆర్టెమిసియా అన్నూ, లిక్కోరైస్, అలోవెరా, శాతవరి, ఇసబ్గోల్ వంటి మొక్కల సాగుకు ఎకరాల్లో భూమి అవసరం లేదు. తక్కువ స్థలంలోనూ కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.

ఇండియాలో ఔపధ మొక్కలను విపరీతంగా పెంచుతున్నారు.. తక్కువ ఉత్పత్తి.. అధిక డిమాండ్ కారణంగా.. రైతులకు మంచి ఆదాయాన్ని అర్జించవచ్చు. ప్రభుత్వం కూడా ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే తులసి, కలబంద, అశ్వగంధ వంటి మొక్కల సాగు బాగా పెరుగుతోంది. తులసి మొక్కలు సాధారణంగా మతపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. ఔషధ గుణాలు కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే చాలా రకాల మందుల్లో దీనిని వినియోగిస్తారు. తులసిలో యూజినాల్. మిథైల్ సిన్నమేట్ ఉంటాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు మందులు తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.

1 హెక్టారులో తులసి పండించడానికి కేవలం 15,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది, కానీ 3 నెలల తర్వాత ఈ పంట దాదాపు 3 లక్షల రూపాయల రాబడి ఇస్తుంది. తులసి లాగే స్టీవియా సాగు (Stevia Farming) కూడా బాగా లాభదాయకమైనది. స్టీవియా కూడ తులసి జాతికి చెందినది. దీనిని తీపి తులసి అంటారు. స్టీవియా డయాబెటిస్ మందుల తయారీలో బాగా వినియోగిస్తారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఈ పంటకు డిమాండ్ భారీగా పెరుగుతోంది.

స్టీవియా సాగుకు ఎరువులు, పురుగుల మందులు కూడా అవసరం లేదు. కీటకాలు కూడా ఈ పంటకు హాని చేయలేవు. ఒకసారి పంట వేస్తే చాలు. ఐదు సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తుంది. ప్రతి ఏటా దీని ఉత్పత్తి పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. స్టెవియా మొక్క 60 నుంచి 70 సెం.మీ పొడవు పెరుగుతుంది. ప్రతి మూడు నెలలకోసారి ఆకులను కోసి విక్రయించవచ్చు.

బెంగళూరు, పూణే, ఇండోర్, రాయ్‌పూర్ వంటి నగరాల్లో స్టెవియా సాగు చేస్తున్నారు. పరాగ్వే, జపాన్, కొరియా, తైవాన్ మరియు అమెరికా వంటి దేశాల్లో కూడా స్టీవియాను పండిస్తారు.
Attachments area

Read more RELATED
Recommended to you

Exit mobile version