పుష్పకు షాక్ : అక్క‌డ‌ బాయ్‌క‌ట్ చేయాల‌ని పెరుగుతున్న డిమాండ్

-

అల్లు అర్జున్ హీరోగా నేడు పుష్ప ది రైజ్ సినిమా పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల అయింది. ప్రిమియ‌ర్ షోలు, బెనిఫిట్ షో ల‌తో హిట్ టాక్ ను సొంతం చేసుకుని దూసుకుపుపోతుంది. ఈ ఒక్క రోజే దాదాపు రూ. 30 కోట్ల‌ నుంచి రూ. 40 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కూడా అభిమానులు జోస్యం చెబుతున్నారు. అయితే అంతా మంచిగా న‌డుస్తుంద‌ని అనుకున్న స‌మ‌యంలో పుష్ప చిత్ర బృందానికి షాక్ త‌గిలింది. క‌ర్ణాట‌క లో పుష్ప సినిమాను బాయ్‌క‌ట్ చేయాల‌న్న డిమాండ్ రోజు రోజు కు పెరుగుతుంది.

క‌ర్ణాట‌క లో క‌న్న‌డ భాషా లో కాకుండా తెలుగు లో ఎక్కువ థీయేట‌ర్స్ లో విడుద‌ల చేయ‌డ‌మే కార‌ణం. దీని పై క‌న్న‌డ భాష అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. క‌ర్ణాట‌క లో పుష్ప చిత్ర బృందం కన్న‌డ కంటే తెలుగుకే ఎక్కువ ఆస‌క్తి చూపుతుంద‌ని అందుకే బాయ్ క‌ట్ చేస్తున్న‌ట్టు ప‌లువురు తెలుపుతున్నారు. అంతే కాకుండా ట్వీట్ట‌ర్ లో కూడా బాయ్‌క‌ట్ పుష్ఫ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ లో ఉంచుతున్నారు. అలాగే ప‌లు సోష‌ల్ మీడియా లో కూడా పుష్ప సినిమా ను బాయ్ క‌ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఫోస్ట్ లు పెడుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమా ను అడ్డుకుంటామ‌ని కూడా ప్ర‌క‌టిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version