నేడు వైయస్సార్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైయస్సార్ టిపి స్థాపించిన సంవత్సర కాలంలోనే ఎంతో పురోగతి సాధించింది అన్నారు. పార్టీ పెట్టకముందు నుంచే నిరాహార దీక్షలు చేస్తున్నారని తెలిపారు. మా దీక్షల వల్లే పాలకపక్షానికి బుద్ధి వచ్చిందని, ప్రతిపక్షాలకు సోయి వచ్చిందని అన్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తూనే ఉన్నానని తెలిపారు. ఇప్పటి వరకు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఇంకా కొనసాగిస్తానని అన్నారు.అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చటే ఉండదన్నారు వైయస్ షర్మిల.
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయ సమీకరణాలు మారుతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని తెలిపారు. వైయస్సార్ టిపి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని చెప్పారు. తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేస్తుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి మహాకూటమి గా ఏర్పడ్డా మేము కలవమని తెలిపారు వైఎస్ షర్మిల.