రైతులను ముంచి రైతు దినోత్సవాలా : సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వ్యాఖ్యానించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను నిలిపివేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ రైతు దినోత్సవాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి. రైతులందరూ బాగుండాలనే మేం కోరుకుంటామని, రైతు దినోత్సవం జరిపే అర్హత వైసీపీకి లేదని ఆయన మండిపడ్డారు. ఈ మూడేళ్లలో రైతులు కుప్పకూలిపోయారని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఆపేయడం ఎంత అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూక్ష్మ నీటి పారుదల రంగానికి టీడీపీ హయాంలో ఏటా రూ.1200 కోట్లు ఖర్చు చేశామన్నా సోమిరెడ్డి.. ఈ మూడేళ్లలో మీరెంత ఖర్చు చేశారు? అసలు, పథకాన్నే ఆపేశారంటూ ధ్వజమెత్తారు. భూసార పరీక్షలు చేసి, సూక్ష్మపోషకాలైన జింకు, జిప్సం, బోరాన్ ఉచితంగా అందించే పథకం అమలు చేశామని, దీన్ని కూడా ఆపేశారన్నారు. కేంద్ర-రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి యాంత్రీకరణ పథకాన్ని కూడా ఆపేశారని, ఈ పథకానికి ఏడాదికి రూ.400 కోట్లు ఖర్చు చేశామన్నారు. రైతు రథం కింద రెండేళ్లలో 23 వేల ట్రాక్టర్లు ఇచ్చామని, దీన్ని కూడా నిలిపేశారన్నారు. మీకసలు రైతు దినోత్సవం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version