బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ వీళ్లే.. ప్రారంభం అప్పటి నుంచే.. కానీ..!!

-

తెలుగు బిగ్ బాస్ రియాల్టీ ఎంటర్టైన్మెంట్ షో గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందినట్టుగానే నేడు తెలుగులో కూడా ఈ షో బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక స్టార్ మా లో టెలికాస్ట్ అయిన బిగ్బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తిచేసుకుని సీజన్ 6 కోసం ప్రేక్షకుల ముందు రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే సీజన్ సిక్స్ కి కూడా హోస్టుగా నాగార్జున వ్యవహరించబోతున్నారు. ఇక కంటెస్టెంట్లుగా ఎవరు రాబోతున్నారు? ఎప్పటినుంచి ప్రారంభం కాబోతోంది? ఇలా అన్ని విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఇక ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లేటెస్ట్ రియాల్టీ షో సెప్టెంబర్ 4వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది అని సమాచారం. ఇక నిజానికి ఆగస్టు చివరి వారంలోని ఈ షో ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేశారు. ఇకపోతే ఈసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా యాంకర్ శివ ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ సరికొత్త సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఏకంగా 17 మందిని ఫైనల్ చేశారట. అందులో 15 మందిని ఒకేసారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారు మిగతా ఇద్దరినీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపిస్తారని సమాచారం.

ఇక ఎవరెవరు కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారు అంటే.. ప్రముఖ యాంకర్ ఉదయభాను, నేహా చౌదరి, జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి, ఆషా షైనీ, మంజూష, రోషన్, సింగర్ మోహన భోగరాజు, లక్ష చదలవాడ, ట్రాన్స్ జెండర్ తన్మయ్, విజ్ఞాన్ దాసరి, శంకర్ పద్మిని , సంజనా చౌదరి ,కుషిత కళ్ళపు,భరత్ కుమార్ , కౌశిక్ , కరుణ, శ్రీమంగం, ప్రీతి ఆస్రాని, సుమంత్ అశ్విన్ , చైతన్య గరికపాటి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే వీరందరినీ బిగ్ బాస్ హౌస్ లోకి పిలుచుకునే ముందు క్వారెంటైన్ లో పెట్టిన తర్వాతనే హౌస్ లోకి ఆహ్వానిస్తారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version