అతి తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న ప్రముఖ బ్యాంకులు ఇవే..

-

సొంతింటి కల నెరవేర్చుకోవడం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది కాలంలో రెపో రేటును మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది రుణ ఈఎంఐ లు, వడ్డీ రేట్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అయినప్పటికీ, అనేక బ్యాంకులు తమ ఖాతాదారులకు తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తున్నాయి. మీరు మీ స్వంత ఇంటిని కొనుగోలు చేయాలను కుంటున్నట్లయితే, తక్కువ వడ్డీ రేట్లకు ఏ బ్యాంకులు గృహ రుణాలను అందజేస్తున్నాయి.. ఆ బ్యాంకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హోమ్ లోన్

ఆర్‌బీఐ గత ఏడాది కాలంలో రెపో రేటును 6 సార్లు పెంచింది. రెపో రేటు దాదాపు 250 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీని తర్వాత ఇప్పుడు రెపో రేటు 6.50 శాతానికి పెరిగింది. దీంతో గత ఏడాది కాలంలో రుణాలపై వడ్డీ రేటు కూడా క్రమంగా పెరిగింది. వడ్డీ రేట్ల పెరుగుదల ప్రతి నెలా మీ ఈఎంఐ లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ వడ్డీ రేటు, చెల్లించాల్సిన ఈఎంఐ ఎక్కువ..

తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తున్న బ్యాంకులు ఏవో చూద్దాం..

ఇండస్‌ఇండ్ బ్యాంక్ – 8.4 శాతం, ఇండియన్ బ్యాంక్ – 8.45 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ – 8.45 శాతం, యూకో బ్యాంక్ – 8.45 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా – 8.5 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 8.6 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 8 .75 శాతం, ఐడిబిఐ బ్యాంక్ – 8.75 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 8.8 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ – 8.85 శాతం.. మీకు ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి రుణాలను ఇస్తాయో ఆ బ్యాంకును ఎంపిక చేసుకొని లోన్ తీసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version