అభిమానులను నిరాశపరిచిన తండ్రీకొడుకుల కాంబినేషన్స్ ఇవే..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోల ఫ్యామిలీ లు చాలానే ఉన్నాయి.. అయితే ఈ స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే అభిమానులలో ఎనలేని ఆనందం లభిస్తుంది. అయితే అలాంటిది ఆ స్టార్ హీరో తన తనయుడుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అంటే ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అంతేకాదు స్టార్ హీరో వారి తనయుడు కాంబినేషన్లో సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తాయని అందరూ ఎన్నో ఊహాగానాలను వ్యక్తం చేస్తారు. కానీ సినిమా విడుదలైన తర్వాత అంచనాలను అందుకోలేక భారీ డిజాస్టర్ గా మిగిలి ఉంటాయి. ఎన్టీఆర్ – బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు – నాగార్జున, కృష్ణ – రమేష్ బాబు , కృష్ణ – మహేష్ బాబు, రామ్ చరణ్ – చిరంజీవి, నాగార్జున – నాగచైతన్య, మోహన్ బాబు – మంచు విష్ణు ఇలా ఎన్నో కాంబినేషన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చి పూర్తిస్థాయిలో నిరాశను మిగిల్చాయి. ప్రేక్షకుల ముందు నిరాశ పరిచిన తండ్రి కొడుకుల కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1. ఎన్టీఆర్ – బాలకృష్ణ:గతంలో స్వర్గీయ నటుడు ఎన్టీఆర్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో ఆయన తనయుడు బాలకృష్ణ కూడా అంతే ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. వీరిద్దరికీ డై హార్డ్ ఫాన్స్ కూడా ఉన్నారు అనడంలో సందేహం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ సింహం నవ్వింది, అక్బర్ సలీం అనార్కలి వంటి సినిమాలు మాత్రం పూర్తిగా డిజాస్టర్గా మిగిలాయి.

2. అక్కినేని నాగేశ్వరరావు – నాగర్జున :ఈ తండ్రి కొడుకుల కాంబినేషన్లో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అగ్నిపుత్రుడు , ఇద్దరూ ఇద్దరే వంటి సినిమాలు మాత్రం అభిమానులకు నిరాశను కలిగించాయి.

3. కృష్ణ – మహేష్ బాబు :మహేష్ బాబు కూడా కృష్ణ సినిమాలో బాలనటుడిగా ఎన్నో సినిమాలలో నటించాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వంశీ , టక్కరి దొంగ సినిమాలు మాత్రం డిజాస్టర్ గా మిగిలాయి.

4. మోహన్ బాబు – మంచు విష్ణు:వీరి కాంబినేషన్లో వచ్చిన గాయత్రి , గేమ్ వంటి సినిమాలు రెండూ కూడా డిజాస్టర్ గా మిగిలాయి.

5. చిరంజీవి – రామ్ చరణ్ :ఇటీవల వచ్చిన ఆచార్య , అంతకు ముందు వచ్చిన బ్రూస్ లీ సినిమాలు కూడా రెండూ డిజాస్టర్ గా మిగిలాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version