ఇండియాకు ఇవే చివరి ఎన్నికలు.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

-

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో సీపీఐ, సీపీఐ(ఎం), టీడీపీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి నీ భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు మంత్రి పొంగులేటి. తాజాగా ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు రావాలని ఎలా ఓట్ల వేశారో ఇప్పుడు కూడా అలాగే ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. 400 సీట్లు బీజేపీకి వస్తే.. రాజ్యాంగాన్ని మార్చుతుందన్నారు. ఇండియాకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని.. కేంద్రంలో ఉన్న బీజేపీని, ఆ నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టకపోతే దేశం ప్రమాదంలో ఉందన్నారు.

తెలంగాణకు 9లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ చెబుతుంది. ఆ డబ్బులు ఎవరివి.. ఎవరికీ ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్, రాహుల్, రేవంత్ రెడ్డి మీద గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. వేల బుక్స్ చదివిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వమని కోరాం.. కానీ అసెంబ్లీకీ రాలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడంతో నీళ్లులేని పరిస్థితి అయిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version