సిల్వర్ స్క్రీన్ పై అలరించిన రియల్ డాక్టర్స్ వీరే..!!

-

ముఖ్యంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ప్రతి నటుడు కూడా తాము పోషించిన పాత్రలకు జీవం పోయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అలా.. బిచ్చగాడు వేషం ఇచ్చినా సరే ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగలిగినప్పుడే వారిని పూర్తిస్థాయి ఆర్టిస్ట్ అని అంటారు. ఇక రోడ్డు సైడ్ రోమియో నుంచి డాక్టర్, లాయర్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పాత్రల్లో వెండితెరపై మెప్పించడానికి చాలామంది ప్రాణం పెడతారు. ఇక ముఖ్యంగా చాలామంది ఇండస్ట్రీలోకి రాకముందు ఉన్నత చదువులు చదివి నిజజీవితంలో డాక్టర్లు అయిన వారు కూడా ప్రస్తుతం నటీనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన రియల్ డాక్టర్లు ఎవరో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

భరత్ రెడ్డి:
తలైవి, ఈనాడు వంటి ద్విభాష చిత్రాలతో పాటు అనేక విజయవంతమైన చిత్రాలలో కనిపించిన తెలుగు నటుడు భరత్ రెడ్డి నిజానికి కార్డియాలజిస్ట్. హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో కార్డియాలజీ విభాగంలో జూనియర్ కన్సల్టెంట్గా కూడా భరత్ రెడ్డి పనిచేశారు.

సాయి పల్లవి:
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్న స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి 2016లో టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి వైద్య విద్యను పూర్తి చేసింది. ఒకవైపు హీరోయిన్గా రాణిస్తూనే మరొకవైపు అప్పుడప్పుడు ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

రూప:
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా ద్వారా 2020లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టి పెరిగింది .సినిమా పైన మక్కువతోనే డాక్టర్ వృత్తి నీ పక్కనపెట్టి సినిమాలలో యాక్టర్ గా తన సత్తా చాటుతోంది.

ఓంకార్:
భారతీయ తెలుగు చలనచిత్ర దర్శకుడిగా, టీవీ ప్రెసెంటర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన రాజు గారి గది సిరీస్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈయన వృత్తిరీత్యా డాక్టర్ కూడా.. ఫిజియోథెరపీలో పట్టభద్రుడు కానీ నటన మీద ఆసక్తితో టాలీవుడ్ రంగా ప్రవేశం చేశాడు.

రాజశేఖర్:
ఫ్యామిలీ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన వృత్తిరీత్యా డాక్టర్ మొన్నా మధ్య కమెడియన్ సునీల్ కూతురు అనారోగ్య బారిన పడటంతో రాజశేఖర్ దగ్గర నుండి ఆ పాప ను మామూలు మనిషిని చేశారు.

శివాని రాజశేఖర్:
తెలుగు తమిళ్ చిత్ర పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తండ్రి లాగే డాక్టర్ కూడా హైదరాబాదులోనే అపోలో మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసింది.

శ్రీ లీల:
పెళ్లి సందడి సినిమాతో బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఈమె ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం ధమాకా, అనగనగా ఒక రాజు వంటి సినిమాలలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version