మనం తినే ఈ ఐదు ఫుడ్ ఐటెమ్స్ కుక్కలకు చాలా డేంజర్.. మీరు కూడా పెడుతున్నారా మీ డాగీకీ

-

ఈరోజుల్లో కుక్కలను పెంచుకోవటం అందరికి బాగా ఇష్టమైపోయింది.. ప్రతి ఇంటికి ఒక కుక్కు ఉంటుంది. అదేంటో చాలామంది కుక్కలను వాటిమీద ప్రేమకోసం పెంచుతున్నారో..ఉందని చూపించుకోవటానికి పెంచుతున్నారో తెలియడం లేదు. అయితే కొంతమందికి మత్రం కుక్కలంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని ముద్దు చేస్తూ..సొంతబిడ్డల్లా చూసుకుంటారు. మనం ఏది తింటే అది వాటికి పెడుతుంటాం. అయితే మనం ప్రేమతో పెట్టే కొన్ని పుడ్ ఐటమ్స్ కుక్కలు ప్రాణానికి చాలా ప్రమాదం అవుతాయాట. విషయం తెలియక పెట్టే ఆహారం..వారికి విషంగా మారుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చాక్లెట్లు అంటే అందరూ బాగా ఇష్టపడతారు. అయితే.. చాక్లెట్లు ఆరోగ్యానికి అంత మంచిది ఏమీ కాదు. మనకే ఎక్కవు తినకూడదు..అలాంటిది కుక్కలకు అసలే పెట్టొద్దంట. చాక్లెట్‌లో మిథైల్‌క్సాంథైన్‌లు ఉంటాయి. ఇది కుక్కలకు విషపూరితంగా మారుతుంది. అలాగే, అవి కుక్కల జీవక్రియలో కూడా ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్ల, కుక్కలకు చిన్న చాక్లెట్ ముక్క కూడా సమస్యగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి కుక్కలకు చిన్న పీస్ కూడా పెట్టకూడదు.

ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా తాగేస్తాం. అదేంటో ఓ పెగ్ తాగుదాం అని స్టాట్ చేస్తారు..అవి రెండు మూడు నాలుగు అయినా తృప్తితీరదు చాలామందికి. మితమైన ఆల్కాహాల్ శరీరానికి మంచిదే..కానీ పరిమితి దాటితేనే ప్రమాదం..అలాగే.. సున్నితమైన కుక్కలను ఆల్కాహాల్ మరింత హానికరం. కుక్కలు వైన్ లేదా ఆల్కహాల్ తాగడం మీకు సరదాగా అనిపించవచ్చు. అయితే, ఇది కుక్క శరీరానికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. మద్యం సేవించడం వల్ల కుక్కలు వాంతులు చేసుకునే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. కుక్కలు చనిపోవడానికి కూడా ఇది దారి తీస్తుందట.

వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను దాదాపు అన్ని రకాల వంటలలో మనం వినియోగిస్తూ ఉంటాం.అవి లేకుండా చాలా వంటలు తయారుచేయలేమేమో కదా.. అయితే ఇవి మనకు మంచివి కావొచ్చు కానీ కుక్కలకు మాత్రం చాలా హానికరమట. వీటిని కుక్కలకు దూరంగా ఉంచడం మంచిది. ఉల్లిపాయల కంటే కూడా వెల్లుల్లి ఇంకా ప్రమాదకరం. ఈ రెండింటినీ మీ ఇంటి కుక్క తింటే అది అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

చాలా మంది ఉదయం లేవగానే కాఫీ తాగనిదే ఏ పని మొదలుపెట్టరు.. అయితే కాఫీ మనకు ఉత్సాహాన్ని ఇస్తుందేమో కానీ కుక్కలకు మాత్రం అనారోగ్యాన్ని కలిగిస్తుంది..కాఫీలోని కొన్ని పదార్థాలు కుక్కలకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కుక్కలకు ఎట్టి పరిస్థితుల్లో కాఫీ ఇవ్వొద్దు. కాఫీ ఇస్తారా ఎవరైనా అనుకుంటున్నారేమో..ఉంటారండి..అలాంటి మహానుభావులు కూడా.

డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి ఎంతో పోషకవిలువలు అందుతాయి..కానీ కుక్కలకు చాలా ప్రమాదకరం. కాబట్టి కుక్కలకు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైఫ్రూట్స్ ఇవ్వొద్దు.

ఇప్పటివరకూ వీటిల్లో ఏదో ఒకటి మీరు మీ డాగీకి పెట్టేఉంటారు కదా..పెట్టకుంటే మంచిది. ఒకవేళ వీటిని కుక్కలకు పెట్టే అలవాటు ఉంటే..వెంటనే మానేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version