కొన్ని కొన్ని సార్లు మనం ప్రవర్తించే తీరును బట్టి మనం ఎలాంటి వాళ్ళమో ఇతరులు అంచనా వేస్తూ ఉంటారు. పైగా మంచి వ్యక్తిగా మనం ఉండాలి అంటే ఇవి తప్పక మనలో ఉండాలి. మరి వీటి కోసం ఒక లుక్ వేసేయండి.
నిజాయితీగా ఉండడం:
నిజాయతీగా ఉండడం చాల అవసరం. సందర్భం ఏదైనా కూడా మంచిగా, నిజాయతీగా ఉండాలి.
కాంప్లిమెంట్ చేయడం:
ఎవరైనా దేనిలోనైనా గెలిచిన లేదంటే వాళ్లని పొగడాలి అన్న మంచి లక్షణాలు ఉన్న వాళ్ళు వెటకారం చెయ్యరు. నిజాయితీగా వాళ్లకి తగ్గ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. మంచి వ్యక్తిగా మీరు అనిపించుకోవాలి అంటే తప్పక ఈ లక్షణం మీలో ఉండాలి.
తల్లిదండ్రులతో మాట్లాడడం:
మంచి వ్యక్తులు ఎప్పుడూ కూడా తమ తల్లిదండ్రులతో అన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రోజు ఎలా జరిగింది మొదలు అనేక విషయాలు వాళ్ళని అడగడం, వీళ్ళు కూడా మాట్లాడడం చేస్తారు అలాగే తల్లిదండ్రులతో ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు.
ప్రతి ఒక్కరి పట్ల దయ కలిగి ఉండడం:
ఎవరిని దూషించకుండా, నిందించకుండా ఇతరుల పట్ల ఎంతో మర్యాదగా ఉంటారు. ఇది కూడా అవసరం.
ఇతరుల పట్ల ఆలోచించడం:
మంచి లక్షణాలు ఉన్న వాళ్ళు ఇతరుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అంతే కాని వాళ్ళు ఏమైపోతే నాకేంటి అని స్వార్ధంగా ఉండరు.
ప్రతి దాంట్లో బెస్ట్ ఇవ్వడం:
వాళ్లు ఏ పని చేసినా బెస్ట్ ఇస్తూ ఉంటారు. అలానే వాళ్ళని వాళ్ళు మార్చుకోవడం, వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం చేస్తూ ఉంటారు.