అల్లు అర్జున్ ‘పుష్ప’లో విలన్ పాత్ర మిస్ చేసుకున్న స్టార్స్ వీళ్లే.. !!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప-2’ షూటింగ్ ను ఇటీవల డైరెక్టర్ సుకుమార్ స్టార్ట్ చేశారు. మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ ‘పుష్ప-2’ అంచనాలను మించి ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ పిక్చర్ కు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

క్యూట్ బ్యూటీ రష్మిక మందన ఇందులో హీరోయిన్ కాగా, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఇక విలన పాత్ర ఈ సినిమాలో హైలైట్ అయింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజల్ ‘భన్వర్ సింగ్ షెకావత్ ఐపీఎస్’ గా అదరగొట్టారు. ఫహద్ విలనిజం ప్రేక్షకులకు బాగా నచ్చింది.

నార్త్ బెల్ట్ లో అయితే ‘పుష్ప’ చిత్రం సూపర్ సెన్సేషనల్ అయింది. నార్త్ ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం ‘పుష్ప’ సినిమాకు ఫిదా అయిపోయారు.అయితే, ఈ సినిమాలో విలన్ పాత్ర కు తొలుత చాలా మంది స్టార్స్ ను అనుకున్నారు. కానీ, వారు రిజెక్ట్ చేయడంతో చివరకు ఈ పాత్రకు ఫహద్ ఫాజిల్ వద్దకు వచ్చింది.

భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను తిరస్కరించిన ఆ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ‘పుష్ప’లో విలన్ పాత్ర కోసం తొలుత స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను అనుకున్నారట. కాగా, ఆయన ఈ పాత్రను సున్నితంగా తిరస్కరించారని సమాచారం.

ఆ తర్వాత ఆర్.మాధవన్ ను ఈ పాత్ర కోసం అనుకోగా, ఆయన కూడా వద్దన్నాడట. దాంతో తమిళ్ హీరో ఆర్య వద్దకూ ఈ రోల్ వెళ్లగా ఆయన కూడా నో చెప్పారట. అలా చివరకు ఈ పాత్ర ఫహద్ ఫాజిల్ వద్దకు వెళ్లింది. ఆయన ఓకే చేసేయడంతో ఈ సినిమా వచ్చేసింది. ‘పుష్ప-2’ షూటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా కూడా డెఫినెట్ గా రికార్డ్స్ అన్నిటినీ తిరగరాస్తుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version