నీట్ పరీక్షలో మంచి మార్కులను పొందాలంటే ఈ టిప్స్ తప్పనిసరి..

-

నీట్ పరీక్షకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో విద్యార్థుకు ఆందోళన పడుతుంటారు. వారం రోజుల్లో కరెక్ట్ ప్లానింగ్ ప్రకారం చదివితే మంచి స్కొరు చేయవచ్చునని ప్రముఖులు అంటున్నారు.నీట్ లో బయాలజీ, ఫిజిక్స్., కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉంటాయి. మూడు సబ్జెక్టులకు మూడు భిన్నమైన విధానాన్ని అవలంబించి మార్కులు సాధించవచ్చు. ఎన్సిఆర్టి పాఠ్యపుస్తకాన్ని పూర్తి స్థాయిలో చదవడం సాధ్యం కాదు.

అయితే గత పదేళ్ల నీట్ టెస్ట్ పేపర్స్ క్షుణంగా సాధన చేయండి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సాధన చేస్తే బయాలజీలో మంచి మార్కులు సాధించవచ్చు. 900 వందల ప్రశ్నలను సాల్వ్ చేసే ప్రావిణ్యం మీలో ఉంటుంది. వీటిని పూర్తిగా చదవడం ద్వారా ఎన్సిఆర్టి పాఠ్యపుస్తకంలోని అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. రివిజన్స్ కి ఇది చాల సులభమైన మార్గం.
కెమిస్ట్రీ లో మంచి స్కొర్ చేయవచ్చు.ఫిసికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ,ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీగా, విభజించుకుని చదువుకోవాలి..ఇది కేవలం రెండు రోజులలో పూర్తీ చెయ్యాలి.ప్రతి ఫార్ములాకు నాలుగు నుంచి ఐదు న్యూమరికల్స్ సాల్వ్ చేసేలా ఉండాలి. దీంతో ఫిసికల్ కెమిస్ట్రీలో అన్ని టాపిక్స్ ను పూర్తి చేయవచ్చు. గ్రూప్స్ పైన ప్రత్యేక శ్రద్ద పెడితే ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మార్కులు సొంతం చేసుకోవచ్చు.

కెమికల్ రీయాక్షన్స్ రివిజన్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రతి రీయాక్షన్స్ ను పేపర్ పై పెట్టి ప్రాక్టీస్ చేయడం ద్వారా 80% ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రశ్నలను సాల్వ్ చేయవచ్చు. ఇలా చదువుకోవడం ద్వారా 30శాతం పైగా మార్కులు సంపాధించుకునే అవకాశం ఉంది. ఇక ఫిజిక్స్ అయితే రోజుకు మూడు, నాలుగు గంటలు ప్రిపేర్ అయితే సరిపోతుంది..ఫార్ములా విషయంలో నిర్లక్ష్యం చేయడం ద్వారా..పరీక్షలో ఫిజిక్స్ సాల్వ్ చేయలేక సతమతం అవుతారు. ఒక్కో టాపిక్ కు సంబంధిచిన ఫార్ములాలను రాసుకోవడం ద్వారా మళ్లీ రివిజన్ చేస్తే పూర్తి స్థాయిలో ఫిజిక్స్ పై పట్టు సాధించవచ్చు..

ప్రతి సబ్జెక్టుకు టైం చాలా అనవసరం..ప్రిపరేషన్ నుంచి ఎగ్జామ్ వరకూ ఒక ప్లానింగ్ వేసుకోవడం ఇంపార్టెంట్..ప్రతీ అంశాన్ని నేర్చుకోవడం ముఖ్యం. మాక్ టెస్టుల్లో మార్కులు తక్కువ వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా ఇక పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version