తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని మాజీ ఎంపీ వీ హనుమంత రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా మార్చినట్లు తెలిపారు.తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తాము కూడా మాట్లాడగలమని..కానీ అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని వీహెచ్ విమర్శించారు. ప్రజాపాలనలో కాంగ్రెస్ అద్భుత ప్రగతిని సాధించిందని, అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ సీఎం రేవంత్ సర్కార్ ముందకు వెళ్తుందని ఆయన వెల్లడించారు.