వాళ్లు మృతదేహం బూడిదతో సాంబార్‌ చేసుకుంటారట..!

-

గిరిజనులు, తాండాల్లో నివసించే వారి జీవనశైలి వేరుగా ఉంటుంది.. కొన్ని తెగల వారి జీవనవిధానం, పాటించే పద్ధతులు కూడా చాలా కొత్తగా ఉంటాయి.. మనకు తెలిసినవి కొన్నే.. కానీ మీరు నమ్మలేనివి, చూడనివి చాలా ఉన్నాయి.. ఈ ప్రపంచంలో వింత వింత మనుషులు.. ఇంక వింత ఆచారాలు ఉన్నాయి.. మనిషి చనిపోతే ఆ క్షణం నుంచి ఒక్కో తెగ వారు ఒక్కో విధంగా వారిని సాగనంపుతారు.. అంతెందుకు మనలోనే కొంతమంది పూడుస్తారు, కొంతమంది కాల్చుతారు. ఈ తెగ వాళ్లు మాత్రం శవం బూడిదతో సాంబారు చేసుకుంటారట.. దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్-వినిజ్వులా బోర్డర్‌లోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లోని దాదాపు 250 గ్రామాల్లో యానోమని తెగ వాళ్లు ఉన్నారు..
యానోమాని తెగ వారు చివరి కర్మలకు సంబంధించిన వింత సంప్రదాయాన్ని అనుసరిస్తారు. తమ సంప్రదాయంలో భాగంగా వీరు చనిపోయినవారిని కాల్చిన తర్వాత మిగిలిన బూడిదను కూడా తింటారు. యానాం లేదా సెనెమా అని కూడా పిలువబడే ఈ తెగలో మృతదేహాన్ని ఆకులు, ఇతర వస్తువులతో అంత్యక్రియల కోసం కప్పుతారు. 30-40 రోజుల తర్వాత వారు అతనిని తిరిగిచల తీసుకువచ్చి మిగిలిపోయిన శరీరాన్ని కాల్చివేస్తారు. దేహాన్ని దహనం చేసిన తర్వాత మిగిలే భస్మాన్ని వారు చారు చేసుకోని తాగుతారు. ఇక్కడ ఇదే సంప్రదాయంగా పాటిస్తున్నారు
ఈ సంప్రదాయాన్ని కోఎండోకానిబాలిజం అంటారు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని బంధువులు తిన్నప్పుడే అతని ఆత్మకు శాంతి చేకూరుతుందని వాళ్లు నమ్ముతారు.. అందుకే ఆ బూడిదను ఏదో ఒక విధంగా తింటారు. వారు ఈ విధంగా ఆత్మను కాపాడుకుంటారట… ఒక వ్యక్తి హత్యకు గురైతే, అతని శరీరం యొక్క బూడిదను మహిళలు మాత్రమే తింటారు..వారి అంత్యక్రియలు కూడా భిన్నంగా నిర్వహిస్తారు.
ఏ సంప్రదాయం అయినా ఆధారాల మీద కంటే.. నమ్మకం మీదే ఎక్కువగా నడుస్తుంది.. కాబట్టి.. దేన్ని తీసిపడేయలేం.. పూర్వికులు చెప్పారు..మనం చేశాం.. రేపు మన పిల్లలకు చెప్తాం.. వాళ్లు వాళ్ల పిల్లలకు..ఇది ఇంతే..సంప్రదాయాలకు సైన్స్‌ జోడించనంతకాలం ఇది ఇలానే జరుగుతుందని కొందరు అభిప్రాయ పడుతుంటారు.. మీరేమంటారు.?

Read more RELATED
Recommended to you

Exit mobile version