దేశ ప్రజలకు శుభవార్త.. తగనున్న వస్తువుల ధరలు ఇవే

-

కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రకటించారు. పార్లమెంటులో ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సంస్కరణలపై దృష్టి సారించాము. పటిష్టమైన విధానాలతో 28 నెలల కాలంలో 80 కోట్లమందికి ఉచితంగా బియ్యం అందించాము. కరోనా సంక్షోభ సమయంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశాము. ఇకపై ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతుంది. వంద కోట్ల మందికి 220 కోట్ల కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ జరగడం విశేషం. సామాజిక భద్రత, డిజిటల్ చెల్లింపుల విషయంలో చక్కటి అభివృద్ధి సాధించాము. భారత ఆర్థిక వ్యవస్థ సరైన పంథాలో పయనిస్తోంది.

స్థిరీకరణతో కూడిన అభివృద్ధి దిశగా భారత్ ముందుకు అడుగులు వేస్తోంది. మైనారిటీల సాధికారత, మహిళా సాధికారత, అందరికీ తగిన అవకాశాల కల్పనపై దృష్టి సారించాం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం’ అని నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగంలో వివరించారు. అయితే బడ్జెట్‌ నిర్ణయంతో ధరలు తగ్గేవి… ఎలక్ట్రిక్ వాహనాలు, టీవీలు, మొబైల్ ఫోన్లు, కిచెన్ చిమ్నీలు, లిథియం అయాన్ బ్యాటరీలు, ధరలు పెరిగేవి… టైర్లు, సిగరెట్లు, బంగారం, వెండి, వజ్రాలు, బ్రాండెడ్ దుస్తులు
విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version