ఏటీఎంను దోచుకోలేక.. సీసీ కెమెరా ఎత్తుకెళ్లారు..!

-

భలే దొంగలు.. ఏటీఎంను దోచుకుందామని పక్కా ప్లాన్ వేశారు. ఏటీఎంను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి డబ్బులు ఎత్తుకెళ్లాలనేది వాళ్ల ప్లాన్. కానీ.. ఆ ప్లాన్ కాస్త బెడిసి కొట్టడంతో ఏం చేయాలో పాలుపోక ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. అసలేంజరిగిందంటే..

చండీగఢ్ లో ఉన్న ఓ ఏటీఎం దొంగతనానికి వచ్చారు దొంగలు. ఓ దొంగ ఏటీఎం లోపలికి గ్యాస్ కట్టర్ తో సహా వెళ్లాడు. లోపలికి వెళ్లి గ్యాస్ కట్టర్ ను ఆన్ చేస్తే అది ఆన్ కాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఏటీఎం సెంటర్ లో ఉన్న సీసీటీవీ కెమెరాను ఎత్తుకెళ్లారు దొంగలు. ఇక.. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

అయితే.. ఈ ఘటన జరిగి వారం కావస్తున్నా బ్యాంక్ అధికారుల నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు పేర్కొనడం కొసమెరుపు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version