తెర మీదకు సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్

-

మహానటి సినిమా తర్వాత తెలుగులో బయోపిక్ సినిమాల హంగామా బాగా నడుస్తుంది. ఇప్పటికే సెట్స్ మీద ఎన్.టి.ఆర్ బయోపిక్ తో పాటుగా వై.ఎస్సార్ బయోపిక్ గా యాత్ర మూవీ వస్తుంది. ఇక ఈ సినిమాలతో పాటుగా జగపతి బాబు బయోపిక్ గా సముద్రం సీరియల్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయట.

తెలుగు పరిశ్రమలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేసి ఇండస్ట్రీ ఎదుగుదలకు తోడ్పడ్డారు నటశేఖర కృష్ణ. ఎలాంటి సినిమానైనా చేసి చూపించే సత్తా ఉన్న నటుడు. ఇక ఆయన వారసుడిగా సూపర్ స్టార్ మహేష్ అదే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కొనసాగిస్తున్నాడు. ఇక కృష్ణ బయోపిక్ పై తన మనసులో మాట చెప్పాడు కృష్ణ గారి చిన్నళ్లుడు సుధీర్ బాబు.

ఆయన హీరోగానే కాదు నిర్మాతగా మారి చేస్తున్న సినిమా నన్ను దోచుకుందువటే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృష్ణ గారి బయోపిక్ ఖచ్చితంగా ఉంటుదని చెప్పుకొచ్చాడు. అయితే ఆ సినిమాలో మహేష్ నటిస్తాడా లేదా.. ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్న విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version