రాష్ట్రంలో దొంగల బెడద క్రమంగా పెరుగుతోంది. దొంగతనాలు వరుసగా జరుగుతుండటం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వారిని పట్టుకోలేక పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా దొంగలు పోలీసులకే సవాల్ విసిరారు.
పోలీస్స్టేషన్ పక్కనే దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలోని టూ టౌన్ పోలీస్స్టేషన్ పక్కన ఉన్న మొబైల్ షాపులో దొంగతనం జరిగింది.ఎస్ఆర్ మొబైల్ షాపు తాళాలు పగలగొట్టిన దుండగులు అందులోని మొబైల్స్ ఎత్తుకెళ్లినట్లు సమాచారం.ఈ ఘటన పీఎస్ పక్కనే జరగడం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.