అంతర్జాతీయ విమానం.. ఒకేఒక్క ప్రయాణీకుడు.. సింగపూర్ నుండి చెన్నై వరకు..!

-

this flight travelled with a single passenger from singapore to chennai
this flight traveled with a single passenger from singapore to chennai

ఆ విమానం ‘వందేభారత్ మిషన్’లో భాగంగా సింగపూర్ నుండి బయలుదేరింది. సింగపూర్ నుండి కోల్‌కతాకు చేరుకొని అక్కడ నుండి చెన్నై బయలుదేరింది. ప్రయాణికులను స్వాగతించేందుకు చెన్నై అయిర్ పోర్ట్ అధికారులు బొర్డింగ్ పాయింట్ దగ్గరకు వెళ్లారు. దాదాపుగా 145 మండి రావాల్సి ఉంది అందుకుగాను అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు కానీ విమానం నుండి కేవలం ఒక్క వ్యక్తే దిగాడు. అధికారులు షాక్ అయ్యారు…!

వివరాల్లోకి వెళితే.. వన్డే భారత్ మిషన్ లో భాగంగా భారత్ నుండి సింగపూర్ వెల్లిన విమానం అక్కడ నుండి 145 మంది ప్రయాణికులను ఎక్కించుకొని తిరిగి భారత్ చేరుతుంది, కోల్‌కతా మీదుగా చెన్నై చేరాల్సిన విమానం కోల్‌కతా లో 144 మంది ప్రయాణికులు దిగిపోయారు. కానీ అందులో మరో ప్రయాణీకుడు ఉన్నాడు. 44 ఏళ్ల ఆ వ్యక్తి చెన్నై చేరాల్సి ఉంది. ఆ ఒక్క వ్యక్తిని తీసుకొని చెన్నై చేరింది. వివరాలు తెలియని చెన్నై అధికారులు అందరికీ స్వాగతం పలికేందుకు వేచి చూస్తున్నారు. కానీ విమానం నుండి ఒక్కడే దిగేసరికి అధికారులు షాక్ అయ్యారు. అతడిని చేరుకొని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సూదురు వ్యక్తిని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version