ఈనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను వరంగల్‌లో పార్టీ గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. జనసమీకరణ భారీగా చేయాలని అధినేత కేసీఆర్ సూచనల మేరకు.. ఆదిలాబాద్ జిల్లా ముఖరా (కే) గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బొట్టు , బట్టలు పెడుతూ 25 ఏళ్ల గులాబీ పండుగ.. మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు రావాలని.. ఆహ్వాన పత్రికను సర్పంచ్ గాడ్గే మీనాక్షి పంచుతున్నారు.
‘ఇది పెండ్లి పత్రిక కాదు.. మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక’ అంటూ ఇంటింటా తిరుగుతున్నారు. 27న ఎల్కతుర్తి లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రావాలని గాడ్గే మీనాక్షి ప్రజలందరినీ ఆహ్వానిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ బాగుపడ్తుందని, ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆమె తెలిపారు.
“ఇది పెండ్లి ఆహ్వాన పత్రిక కాదు మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక”
ఆదిలాబాద్ జిల్లా, ముఖరా (కే) గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెడుతూ, బట్టలు పెడుతూ 25 ఏళ్ల గులాబీ పండుగ మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక పంచిన సర్పంచ్ గాడ్గే మీనాక్షి… pic.twitter.com/JYhCwjgEta
— BRS News (@BRSParty_News) April 9, 2025