వైసీపీ 175 గెలిచే లాజిక్ ఇదే..!

-

గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచామని, అలాగే స్థానిక సంస్థలు, పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వన్ సైడ్‌గా గెలిచామని..ఆఖరికి కుప్పంలో కూడా సత్తా చాటమని కాబట్టి 175కి 175 సీట్లు గెలవడం ఎందుకు సాధ్యం కాదని చెప్పి జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఆ దిశగానే వ్యూహాలు రచిస్తున్నారు.

అయితే 175 ఎలా సాధ్యమనేది క్లారిటీ రావడం లేదు..అలా వన్‌సైడ్ గా గెలవడం కష్టం. కానీ అధికార బలాన్ని, అరాచకం చేయడం, డబ్బులు ఖర్చు పెట్టడం చేసి వైసీపీ ఏదైనా చేస్తుందని టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా 175 సీట్ల కాన్సెప్ట్‌పై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.  క్యాష్ ద్వారా లిక్కర్ అమ్మకాలు చేయడం వలన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నల్ల ధనాన్ని సంపాదించారని, ఈ డబ్బుతోనే వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో రూ.40 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయారని, అందుకే 175 నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని అంటున్నారని చెప్పుకొచ్చారు.

ఇక బీజేపీ నేత అయి ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం వైఖరిపై కూడా విష్ణు కామెంట్స్ చేశారు. ఏపీలో రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయని, అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఏపీలో సీబీఐ, ఈడి, ఐటి రైడ్స్ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. జగన్‌కు అడ్డుగా వచ్చిన వారిని ఆర్ధికంగా నరికేస్తున్నారని, హత్యలు చేసిన ఎమ్మెల్సీలను జగన్ సర్కార్ కాపాడుతోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ నేతల వద్ద పెద్ద ఎత్తున బ్లాక్ మనీ ఉందని ఆరోపించారు.

అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక మద్యం షాపులని ప్రభుత్వమే నడిపిస్తుంది..అలాగే మద్యం రేట్లని విపరీతంగా పెంచింది. ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..అన్నిచోట్లా పేటీఏం, ఫోన్ పే లాంటివి వచ్చాయి. కానీ ఏపీ వైన్ షాపుల వద్ద మాత్రం అలాంటివి లేవు..కేవలం క్యాష్ మాత్రమే. దీనిపైనే విష్ణు విమర్శలు చేశారు..ఆ డబ్బు అంతా వైసీపీ నేతలకు వెళుతుందని ఆరోపిస్తున్నారు. ఆ డబ్బుతోనే ఎన్నికల్లో గెలుస్తారని అంటున్నారు. మరి చూడాలి విష్ణు చెప్పిందే జరుగుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version