మా పెద్దన్న చంద్రబాబు అసలు రంగు, రూపం ఇది! -విజయసాయి ట్వీట్

-

ఓవైపు అన్నయ్య అంటూనే మరోవైపు చంద్రబాబు అసలు రంగు, రూపం ఇది! అంటూ మండిపడుతున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గతంలో గోదావరి పుష్కరాల్లో జరిగిన బోయపాటి షూటింగ్ లో 30 మంది చనిపోతే చంద్రబాబు ఏమన్నారో వినండి అంటూ వీడియోను షేర్ చేశారు విజయ సాయి.”మా పెద్దన్నయ్య చంద్రబాబు అసలు రంగు, రూపం ఇది! అధికారంలో ఉంటే రక్తం తాగే రాక్షసుడు.. ప్రతిపక్షంలో ఉంటే సానుభూతి కోసం డ్రామాలు..

గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు – బోయపాటి షూటింగులో 30 మంది చనిపోతే ఆయన స్పందన మీరే వినండి. అల్జీమర్స్ తో నువ్వు మర్చిపోయినా కర్మ వదలదు బాబన్న”. అంటూ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్ లో “బాబన్నయ్య! సంపాదించిన దాంట్లో కుటుంబ సభ్యులకు వాటా ఇవ్వలేదు. రాష్ట్రానికి న్యాయం చేయలేదు. సీఎంగా 2016 -18 లో సరాసరి 7.6%, 2018 -19 లో 8.3% వడ్డీతో అప్పులు తెచ్చావు. వైసిపి ప్రభుత్వం వచ్చాక 2020 -21లో కేవలం 6.5% వడ్డీకే రుణాలు సేకరించిందని ఆర్బిఐ నివేదిక చెబుతుంది. ఏంటి అన్నయ్య ఇదంతా!”అంటూ మరో ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version