వెస్ట్ ఇండీస్ జట్టు వైఫల్యాలకు ప్రధాన కారణం అదేనా ?

-

గతంలో రెండు సార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన వెస్ట్ ఇండీస్ జట్టు ఈసారి ఇండియా వేదికగా జరగనున్న 2023 వరల్డ్ కప్ మెయిన్ మ్యాచ్ లకు అర్హత సాధించకుండానే ఇంటి బాట పట్టింది. ఈ రోజు స్కాట్లాండ్ తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో వరుసగా మూడు ఓటములను ఎదుర్కొని లీగ్ నుండి నిష్క్రమించింది. దీనితో వెస్ట్ ఇండీస్ పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు ఇంత దారుణంగా వెస్ట్ ఇండీస్ వైఫల్యం చెందింది అని చూస్తే… వెస్ట్ ఇండీస్ లో ప్రధాన క్రికెటర్లు అందరూ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న దేశవాళీ లీగ్ లలో ఆడేందుకు మాత్రం ఆసక్తి చూపిస్తుండడంతో జట్టులో క్వాలిటీ లేదు.

సాదా సీదా ఆటగాళ్లతోనే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ కు వెళ్ళింది. దీనితో చిన్న చిన్న జింబాబ్వే మరియు స్కాట్లాండ్ జట్లు సైతం విండీస్ ను చిత్తు చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version