అయిదు టెస్ట్ ల యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లు విజయం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం లార్డ్స్ లో రెండవ టెస్ట్ జరుగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 416 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 325 పరుగులకే పరిమితమయింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసేలా కనిపించిన ఆస్ట్రేలియా ఈ రోజు ఆటలో భాగంగా కేవలం 279 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీనితో ఇంగ్లాండ్ ముందు 72 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇపుడు ఆస్ట్రేలియాకు ఉన్న బౌలింగ్ వనరులను చూస్తే ఈ స్కోర్ ను ఛేదించడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. కానీ టెస్ట్ లలోనూ కష్టం గా అనిపించిన ఎన్నో టార్గెట్ లను ఛేదించి రికార్డు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి.