రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పటికే ఆయా పార్టీలు జెట్ స్పీడ్ వేగంతో ప్రచారాల లో ఇప్పటికే మేమంతా సిద్ధం సభలతో రాష్ట్రంలో సీఎం జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు ..మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా రేపట్నుంచి(ఆదివారం) సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు.ప్రతి రోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరిలో త్రిభువని సర్కిల్‌లో జరిగే సభ లో వైఎస్ జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. ఈ మేరకు సీఎం జగన్ రేపటి సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ రిలీజ్ చేశారు.