కాంగ్రెస్ ప్రభుత్వానికి సురుకు పెట్టి బలుపు దింపాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సు యాత్రలో భాగంగా శనివారం(ఏప్రిల్27) నాగర్‌కర్నూల్‌లో జరిగిన రోడ్‌షోలో కేసిఆర్ మాట్లాడుతూ… మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.’సీఎం మాటలు కోటలు దాటుతుంటే పనులు గడప దాటడం లేదు అని ఆరోపించారు . దుర్మార్గ కాంగ్రెస్ పాలన పోవాలంటే బీఆర్‌ఎస్‌కు లోక్ సభ ఎన్నికల్లో మద్దతివ్వాలి. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో పోరాటం చేశాను తెలంగాణ సాధించాను అని గుర్తు చేశారు.
దుష్ప్రచారాలు,అబద్ధపు హామీలతో కాంగ్రెస అదికారంలోకి వచ్చింది అని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇటీవలి కాలంలో 225 మంది రైతులు చనిపోయారు. మళ్లీ కరెంటు కష్టాలు వచ్చాయి అని కేసిఆర్ అన్నారు. రోజూ పది గంటలు కరెంటు పోతోంది. మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో తాము సమీక్ష చేసి భోజనం చేస్తుంటే కరెంటు పోయింది. 5 ఎకరాల వరకే రైతుబంధు ఇస్తానంటున్నాడు. మిగిలిన రైతులు ఏం పాపం చేశారు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేయిస్తాం అని హామీ ఇచ్చారు.యువత అప్రమత్తంగా ఉండాలి. మోదీ పాలనలో అన్ని ధరలు పెరిగాయి. గుజరాత్ సీఎం నాగర్ కర్నూల్‌కు రావాల్సిన పని ఉందా అని అన్నారు.