ప్రస్తుతం నడుస్తోంది గడ్డుకాలం.. కరోనా కాలం.. ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దీని వల్ల ఎంతో మంది ఆకలి బాధలు పడుతున్నారు. మనుషులే కాదు.. జంతువులకు కూడా తిండి దొరకడం లేదు. ఇక వీధి కుక్కల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆకలితో అవి నకనకలాడుతున్నాయి. ఎవరైనా కొద్దిగా తిండి పెడితే బాగుండునని ఆశగా చూస్తున్నాయి. అలాంటి కుక్కల పాటిల ఆమె దేవతే అయింది. తాను సంపాదించే కొద్దిపాటి సొమ్ముతో పలు కుక్కలకు తిండి పెడుతూ.. ఆమె తిండి తినకుండా ఉపవాసం ఉంటోంది.
తమిళనాడులోని చెన్నైకి చెందిన మీనా వంట మనిషిగా పనిచేస్తూ సింగిల్‌గా నివాసం ఉంటోంది. ఈమె గత 21 సంవత్సరాలుగా వీధి కుక్కలను చేరదీసి పెంచుతోంది. అయితే కరోనా వల్ల డబ్బుకు సమస్య వచ్చి పడింది. దీంతో ఆమె తాను సంపాదించే కొద్ది మొత్తంలోనే తన వద్ద ఉన్న 13 కుక్కలకు నిత్యం తిండి పెడుతోంది. అందుకు గాను కేవలం రోజుకు కేవలం ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటోంది.
అయితే ముందు ముందు మళ్లీ పరిస్థితి ఎప్పటిలా మారితే తాను యథావిధిగా భోజనం చేస్తానని, అప్పటి వరకు ఇలా ఉపవాసం ఉంటూ కుక్కలకు తిండి పెడతానని ఆమె అంటోంది.