ఆచార్య చాణక్య చెప్పినట్లుగా మనం జీవితంలో అనుసరిస్తే కచ్చితంగా విజయాన్ని చేరుకుంటాము. చాణక్య ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. ఇవి మనం మన గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అయితే చాణక్య తెలివిగల వ్యక్తి ఎప్పుడూ కూడా తనలో తాను కొన్ని ప్రశ్నలు వేసుకుంటారని చెప్పారు మీరు కూడా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా మీరు కూడా ఈ ప్రశ్నలు వేసుకుని తీరాలి. ఎందుకంటే తెలివైన వాళ్ళు కచ్చితంగా ఈ ప్రశ్నలు వేసుకుంటారట.
నాకు సరైన స్నేహితుడు ఎవరు?
నాకు సరైన స్నేహితుడు ఎవరు అని తెలివిగల వ్యక్తి తనని తాను అడుగుతారట ఈ విషయాన్ని ఆచార చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు.
నేను ఎవరు?
నేను ఎవరు అని కూడా తెలివిగల వ్యక్తి తనకి తాను ప్రశ్న వేసుకుంటారు.
మంచి కాలం ఏది?
మంచి కాలం ఏది, సరైన కాలం ఏది అని తెలివిగల వ్యక్తి తనను తాను ప్రశ్నించుకుంటారని చాణక్య చెప్పారు.
నివసించడానికి సరైన ప్రదేశం ఏది?
నివసించడానికి సరైన ప్రదేశం ఏది అని కూడా తనకి తానుగా ప్రశ్నించుకుంటాడు.
సరైన ఆదాయం ఏది?
సరైన ఆదాయం ఏది అని కూడా ప్రశ్నించుకుంటారని ఆచార చాణక్య తెలివిగల వ్యక్తుల గురించి చెప్పారు. నిజానికి ఇలా ప్రశ్నించుకోవడం చాలా మంచిది. దీనివలన ఎవరు వారు, ఏం చేయాలి ఇటువంటి విషయాలు వాళ్ళకి అర్థం అవుతాయి.