‘ నో కాస్ట్ ఈఎమ్ఐ ‘ పథకాన్ని ఎంచుకునేవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..!

-

కరోనా మహమ్మారి నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇది ఇలా ఉండగా ప్రముఖ ఈ – కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు ఫెస్టివల్ సేల్స్ ని నిర్వహించినట్టు తెలిసినదే. ఈ–కామర్స్ సంస్థలు ప్రముఖ బ్యాంకు లతో టైఅప్ అయ్యాయి. ఈ ఆఫర్లన్నింట్లో ‘నో కాస్ట్ ఈఎమ్ఐ’ సౌకర్యం కొనుగోలుదారులను అత్యంత ఆకర్షించింది అనే అనాలి. మరి ఇది ఎలా పని చేస్తుందో ఇప్పుడే చూడండి.

no cost emi

ఈ విషయం ఎలా పని చేస్తుందన్న విషయానికి వస్తే.. మీరు ఏమైనా కొనుగోలు చెయ్యాలంటే ‘నో కాస్ట్ ఈఎమ్ఐ ’ ఆప్షన్ ను ఎంచుకోండి. ఉదాహరణకి రూ .75 వేల రూపాయలు విలువ చేసే ఏదైనా వస్తువును కొనుగోలు చేయానుకుంటున్నారనుకోండి.. మీ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో 12 నెలల ఈఎంఐ కాలానికి గాను ‘నో కాస్ట్ ఈఎమ్ఐ’ ఆప్షన్ ను మీరు ఎంచుకోండి. ఇలా ఇప్పుడు కోణాలున్న వస్తువు మొత్తం ధర 12 నెలల కాలానికి గాను సమానంగా విభజించబడింది. ఇలా మీరు ప్రతి నెల రూ. 6,249 కట్టాల్సి ఉంటుంది. మీరు ఎంచుకున్న 12 నెలల ఈఎంఐ కాలానికి మీ బ్యాంక్ మీ నుండి వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీం కింద మీ వడ్డీ మాఫీ చేయబడుతుంది. దీంతో మీరు రూ. 5,754 వడ్డీ మాఫీ పొందుతారు. వస్తువు కొనుగోలు చేసే సమయంలోనే ముందస్తుగా ఈ వడ్డీ ఛార్ట్ మీకు కనపడుతుంది.

ఈ విధంగా మీరు 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు ఆప్షన్లను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నిర్ణీత సమయంలో వాయిదాలు చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఇది మాత్రమే మర్చిపోకండి. అలానే బ్యాంకులు మీ నుండి పెనాల్టీ ఛార్జీల కింద 2 నుండి 3.5 శాతం అదనపు వడ్డీని వసూలు చేయడం కూడా జరుగుతుంది. ఇలా తగ్గింపును కూడా కోల్పోతారు. కాబట్టి సకాలంలో అమౌంట్ ను కట్టేయాలి. లేకపోతే నష్ట పోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version