జీవితంలో ఆరాధ్యంగా ఉండేవి..జీవితాంతం తోడుగా ఉంటాయి అని అనుకోవడం తప్పు! మనిషి తనని తాను తెలుసుకునే క్రమంలో ఎన్నింటినో చేరువ చేసుకుంటాడు. చేసుకోవాలి కూడా! అలాంటి వేళ మనిషి చేసే మంచికి, మనిషి చేయాలని తపించే చెడుకు మధ్య యుద్ధం వస్తుంది. ప్రామిస్ చేయడం మరువకండి మంచి వైపే ఉంటానని!
మనుషులకు అంతా మంచే జరగాలి. మనిషి చుట్టూ ఉండే ప్రకృతికి అంతా మంచే జరగాలి. మంచిలో సమానత్వం ఉండాలి. మంచిని కొలిచి మనుషులు సమతా మూర్తి అంతటి స్థాయికి ఎదగాలి.అంటే విశిష్ట గుణం ఒకటి మనిషిని ముందుకు నడిపితే మంచి ఫలితాలు అన్నవి జీవితాలను ప్రభావితం చేయడం సాధ్యం.కనుక ప్రేమిస్తూ ఉండడంలో మాట తప్పని నైజం ఉంది.ప్రేమిస్తూ, ఇతరుల క్షేమం ఆశిస్తూ ఉండడంతో కల్లోలితాలను దూరం చేసేందుకు అవకాశం లేదా ఆస్కారం ఉంది.కనుక ఇవాళ ప్రామిస్ చేయండి.. ఆ ప్రామిస్ ను మిస్ చేసుకోకండి.
అంతా మంచే చేస్తానని అందరికీ మంచే చేస్తానని ప్రామిస్ చేస్తున్నా..ప్రేమిస్తూ ప్రేమను పంచుతూ మంచివాళ్లకు అండగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నా..జీవితాంతం తోడుగా ఉంటానని కూడా ప్రామిస్ చేస్తున్నా..ఇలా ఎవ్వరయినా ఎవ్వరికైనా ప్రామిస్ చేసి ఉంటారా ఉంటే ఆ నమ్మకాన్ని నిలుపుకోండి.ఉంటే నమ్మకాలకు ప్రతినిధులుగా ఉండండి. ప్రేమ,అభిమానం అన్నవి చాటుకుంటూ ఇతరుల నమ్మకాలను నిలబెట్టడంలో జీవితం సార్థకతను పొంది ఉంటుంది.మీదైన ప్రేమలో మీవైన అభిప్రాయాలు కలిగి ఉండండి.వాటిని స్థిరం చేసుకుని ముందుకు వెళ్లడమే బాధ్యత.బంధాలను నిలుపుకోవడంలో బాధ్యత ఉంది.బంధాలను కోల్పోవడం లేదా బంధాలకు దూరం జరగడంలో బాధ్యతారాహిత్యం ఉంది. నిరాశ ఉంది.వీటికి మించిన దుఃఖం ఒకటి జీవితాన ఉంది.
మనుషులెవరైనా మంచే చేస్తారు.మనుషులెవ్వరైనా ఇతరుల మంచినే ఆశిస్తారు.మనుషులెవరైనా ఇతరుల నుంచి ప్రేమ ఆశించి,ప్రేమనే తిరుగు టపాలో పంపుతారు.ఇవన్నీ మనం ఇవాళ కాదు ప్రతిరోజూ అనుకోవాలి.సెల్ఫ్ మోటివేషన్ మరియు సెల్ఫ్ డిక్లరేషన్ అన్నవి ఎవరికి వారు పొంది ఉండాలి. ప్రేమలో త్యాగం ఉందా? ప్రేమలో ఇతరుల నుంచి ఏమీ కోరని నైజం ఉందా?స్వార్థరహిత ప్రేమలే జీవితాలను ముందుకు నడుపుతాయి.బంధాలను కలిపి ఉంచుతాయి.అమ్మానాన్న అన్నవి స్వార్థ రహిత ప్రేమలు.వాళ్లిచ్చే ప్రేమ ఉత్తమం..వాళ్లు పంచే ప్రేమ అంతిమం కూడా! మీ జీవితాల్లో అమ్మానాన్న తో పాటు ఎవరున్నారు అన్నది వెతుక్కుని వారికే ప్రామిస్ చేయండి.