ఘోర రోడ్డు ప్ర‌మాదం.. రెండు బైకులు ఢీ ముగ్గురు మృతి

-

ఎదురెదురుగా వ‌స్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు. మ‌రోక‌రి ప‌రిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదం సూర్య‌పేట జిల్లాలోని ఆత్మ‌కూర్ మండ‌లం న‌సీం పేట వ‌ద్ద చోటు చేసుకుంది. కాగ చివ్వెంల – ముకుందాపురం ర‌హాదారి పై న‌సీం పేట గ్రామం వ‌ద్ద ఉన్న మూల ములుపు వద్ద రెండు బైకులు ఎదురెదురుగా వ‌చ్చి ఢీ కొన్నాయి. దీంతో రెండు బైకుల‌పై ప్ర‌యాణిస్తున్న ముగ్గురు యువ‌కులు మృతి చెందారు.

అల‌గే మ‌రో యువ‌కుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అత‌ని పరిస్థితి విషమంగా ఉండ‌టంతో జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స్థానికుల‌ స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగ ఈ ప్ర‌మాదానికి అతి వేగ‌మే అని పోలీసులు ప్రాథ‌మికంగా అంచ‌నాకు వ‌చ్చారు. కాగ ఈ ప్ర‌మాదంలో మృతి చెందిన యువ‌కులు ఆత్మ‌కూర్ మండ‌ల ప‌రిధిలోని తెట్టేకుండ తండాకు చెందిన బానోత్ అర‌వింద్, బోట్యా తండాకు చెందిన భూక్యా న‌వీన్ తో పాటు చివ్వెంల మండ‌లం లోని ల‌క్షి నాయ‌క్ తండా కు చెందిన ధ‌రావ‌త్ ఆనంద్ గా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబాల‌కు స‌మాచారం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version