మంచిర్యాల‌లో రోడ్డు పై పిడుగు..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి..!

-

మంచిర్యాల‌లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. మంచిర్యాల బ్రిడ్జిపై పిడుగు ప‌డ‌టంతో రోడ్డుపై ప్ర‌యాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పిడుగు ప‌డిన వెంట‌నే త‌ల్లితో పాటు కొడుకు మృతి చెందాడు. బైక్ న‌డుపుతున్న వ్య‌క్తి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా చికిత్స పొందుతూ అత‌డు కూడా కొన్ని గంట‌ల్లోనే మృతి చెందాడు. ఇక మృతులు వెంక‌టేష్ మ‌రియు అత‌ని భార్య మౌనిక తో పాటు వారి కుమారుడిగా గుర్తించారు.

ఇదిలా ఉండ‌గా మంచిర్యాల‌లో ఉమ‌యం నుండి ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురుస్తోంది. కాగా రోడ్డుపై ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా పిడుగు ప‌డ‌టంతో ప్ర‌యాణికులు ఎంతో ఆందోళ‌న చెందారు. ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెంద‌టంతో వారి బంధువులు తీవ్రవిషాదంలో నిండిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version