బంగారం ప్రియులకు పిడుగులాంటి వార్త..

-

బంగారం ప్రియులకు భారీ షాక్ తగిలింది. గతవారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయంగా సుంకాలను అమెరికా అధ్యక్షుడు 90 రోజుల పాటు హోల్డ్ చేయడంతో మార్కెట్లలో మరోసారి పాజిటివ్ వైబ్ వచ్చింది. పసిడి భారీగా తగ్గుతుందని అంతా అనుకుంటున్న తరుణంలో అమాంతం పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ ధరపై రూ.2,700 పెరిగి రూ.85,600కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2940 పెరిగి రూ. 93,380కి చేరింది. వెండి ధర సైతం భారీగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే కేజీ సిల్వర్ ధర రూ.2,000 పెరిగి రూ.1,04,000 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news