జాతీయ జంతువు పులి. కొన్నేండ్ల కింద వరకు పులుల జాతికి పెద్ద గండం వచ్చిందని అందరూ భయపడ్డారు. కానీ ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల ఆ గండం తప్పింది. అంతేకాదండోయ్ నేడు ప్రంపంచంలోనే పులులకు సురక్షితమైన స్థానంగా భారత్ నిలించింది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్తు మన ప్రధాని నరేంద్రం మోడి వెల్లడించారు. ఆ వివరాలు తెలుసుకుందాం… ఈ రోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2018 నివేదికను మోదీ విడుదల చేశారు.
2014లో దేశంలో 2,226 పులులు ఉండేవి. 2018 నాటికి వాటి సంఖ్య 2,967కు చేరింది. 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని 9 ఏళ్ల క్రితం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో ప్రంపంచ దేశాలు నిర్ణయించిన విషయం విదితమే. ఆ దిశగా అడుగులు వేయడానికి ప్రంపచ దేశాలు చర్యలు తీసుకున్నాయి. మన దేశంలో కూడా కేంద్రం తగు చర్యలను తీసుకుంది. దీంతో మరో నాలుగేళ్లు ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకున్నాం. ఈ నివేదిక ప్రతి భారతీయుడికి, ప్రతి ప్రకృతి ప్రేమికుడికి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఈ ఐదేళ్లలో పులల సంరక్షణ కేంద్రాలు 692 నుంచి 860కి పెరిగాయి. కమ్యూనిటీ రిజర్వ్‌లు 43 నుంచి 100కి పైగా పెరిగాయి. ప్రపంచంలోనే పులులకు అత్యంత సురక్షితమైన ఆవాసంగా భారత్ మారింది అని మోదీ తెలిపారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సినిమా పేర్లను ప్రస్తావిస్తూ ఏక్తా టైగర్‌తో కథ ప్రారంభమై టైగర్ జిందా హైకి చేరింది.
Delhi: Prime Minister Narendra Modi releases All India Tiger Estimation 2018 on #InternationalTigerDay. pic.twitter.com/4y6iemCLzS
— ANI (@ANI) July 29, 2019
అయితే ఇక్కడితో ఆగిపోదు అని మోదీ చెప్పుకొచ్చారు. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ పేరుతో ప్రతి నాలుగేళ్లకోసారి పులుల సంఖ్యపై ప్రభుత్వం నివేదిక విడుదల చేస్తోంది. 2006లో దీన్ని ప్రారంభించగా.. 2010, 2014లో నివేదిక విడుదల చేసింది. దేశంలో అత్యంత పెద్ద పులుల రిజర్వ్ మన రాష్ట్రంలో (ఉమ్మడి) ఉండేది. అది రాజీవ్ రిజర్వ్ (గతంలో దీన్ని నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్‌గా) పిలిచేవారు. ఇది దేశంలోనే అతిపెద్ద విస్తీర్ణం కలిగిన పులుల సంరక్షణ అటవీ ప్రదేశం. దీని విస్తీర్ణం 3,728 చదరపు కి.మీ. ఉమ్మడి ఏపీలో ఇది కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వ్యాపించి ఉంది. ప్రస్తుతం ఇది రెండురాష్ర్టాలలో రెండు డివిజన్లుగా ఉంది. జాతీయ జంతువు సంరక్షణ అందరికీ ఆనందం కలిగించే అంశం.
– కేశవ