అయోధ్య తీర్పు వెలువడుతున్న నేపధ్యంలో క్షణ క్షణం ఉత్కంట పెరిగిపోతుంది. ప్రతీ ఒక్కరు ఈ తీర్పు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఈ తీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తితో ఎదురు చూస్తుంది… దశాబ్దాలుగా నడుస్తున్న వివాదానికి సుప్రీం ఏ విధమైన ముగింపు ఇస్తుందో అనే ఉత్కంట అటు హిందువుల్లో, ఇటు ముస్లింల్లో ఎక్కువగా ఉంది. రాజకీయ పార్టీలకు కూడా ఈ తీర్పు చాలా కీలకం. ప్రధానంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ తీర్పు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది.
ఈ తీర్పు నేపధ్యంలో అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ లో భారీగా బలగాలను మొహరించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తో పాటు కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతను పెంచింది. ఏ విధమైన అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి గాను నగరంలోకి వెళ్తున్న ప్రతీ బండిని, ప్రతీ మనిషిని, ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. కేంద్ర బలగాలు ఒకరకంగా అయోధ్య నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తీర్పు నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ అంతటా 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించి ప్రభుత్వం. విద్యా, శిక్షణ సంస్థలకు సోమవారం వరకూ సెలవులు ప్రకటించారు.
కేంద్రం 4వేల పారామిలటరీ బలగాలను దింపగా స్థానిక పోలీసులు కూడా భారీగా తనిఖీలు చేస్తున్నారు. అయోధ్యలో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక సరిహద్దు రాష్ట్రాలు అయిన ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పర్యవేక్షణ కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఉగ్రవాద నిరోధక దళం, బాంబు నిర్వీర్యక దళాలు ఏదైనా అవాంచనీయ సంఘటన జరిగితే ఎదుర్కోవడానికి సాయుధ బలగాలను మొహరించారు. ఇక ఏదైనా తేడా జరిగితే జాతీయ భద్రతా దళాన్ని (ఎన్‌ఎస్‌జీ) దించుతామని అధికారులు ప్రకటించారు.