పబ్‌జి మొబైల్ గేమ్‌ను మళ్లీ భారత్‌లో పబ్‌జి మొబైల్ ఇండియా పేరిట లాంచ్ చేయనున్నట్లు పబ్‌జి కార్ప్ ఇటీవలే వెల్లడించిన విషయం విదితమే. కాగా ఆ కంపెనీ వారు ఆ ప్రకటన చేయడంతో అటు టిక్‌టాక్ లోనూ ఆశలు మళ్లీ చిగురిస్తున్నట్లు కనిపిస్తోంది. టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ తమ ఉద్యోగులకు తాజాగా ఓ లెటర్ రాశారు. అందులో పలు కీలక విషయాలను వెల్లడించారు.
చైనా యాప్ అన్న కారణంగా భారత్ మన యాప్‌ను నిషేధించింది. అయితే భారత ప్రభుత్వం అడిగిన అన్ని వివరాలను అందజేశాం. ఇంకా ఏమైనా వివరాలను కావాలన్ని అందిస్తాం. మనమందరం కలిసి యూజర్లకు, క్రియేటర్లకు మన ప్లాట్‌ఫాం ద్వారా మంచి గుర్తింపును ఇద్దాం. టిక్‌టాక్ వృద్ధికి భారత్‌లో మంచి అవకాశాలు ఉన్నాయి.. అని నిఖిల్ గాంధీ తమ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
దీన్ని బట్టి చూస్తే టిక్‌టాక్ కూడా త్వరలో భారత్‌లో రీ ఎంట్రీ ఇస్తుందని అనిపిస్తుంది. ఈ క్రమంలోనే టిక్‌టాక్ ఇండియా యూజర్ల డేటాను భారత్‌లోనే స్టోర్ చేస్తామని ఆ కంపెనీ భారత ప్రభుత్వానికి తెలియజేసినట్లు కూడా సమాచారం. అయితే టిక్‌టాక్ చైనా కంపెనీ. పబ్‌జి కొరియాకు చెందినది. అందువల్ల టిక్ టాక్ కన్నా పబ్‌జి గేమ్‌కే భారత్‌లో మళ్లీ లాంచ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. మరి టిక్‌టాక్ ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.