తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. టీటీడీ చైర్మన్ ట్వీట్ వైరల్

-

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విచారణ అనంతరం నలుగురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. తాజాగా దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఈ కేసులో నలుగురిని సీబీఐ దర్యాప్తు బృందం అరెస్టు చేసింది.

వారిలో భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్)నాడు డైరెక్టర్‌గా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ(పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ(దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్ ఉన్నారు. రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించినట్లు ప్రత్యేక బృందం కనిపెట్టింది’ అని బీఆర్ నాయుడు రాసుకొచ్చారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సైతం బీఆర్ నాయుడు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version