Tirumala: ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం

-

Tirumala Srivari darshan : తిరుపతిలో ఉండే వారికి టీటీడీ శుభవార్త. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా స్పందించారు.

Tirumala Srivari darshan for locals on the first Tuesday of every month

తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనం కల్పించడం పై హర్షం వ్యక్తం చేసిన డిప్యూటి సియం పవన్ కళ్యాణ్… ఎన్నికల సమయంలో తిరుపతి వాసులకు దర్శన అవకాశం కల్పిస్తామని వాగ్దానం చేసినట్లు గుర్తు చేశారు. ఎన్నికల హమీని మొదటి టీటీడీ  పాలక మండలి సమావేశంలోనే నేరవేర్చడం పై పాలకమండలిని అభినందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. టీటీడీ  పాలక మండలి నిర్ణయంతో.. తిరుపతి స్థానికులకు మేలు జరుగుతుందని వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version