వేసవి లో చల్లని టూర్.. తిరుపతి టు ఊటీ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే..!

-

IRCTC వివిధ రకాల టూర్ ప్యాకేజీలని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీల వలన చాలా మంది టూర్స్ వేసి వచ్చేస్తున్నారు. ఊటీ ని వేసవి లో చూసి రావడానికి బాగుంటుంది. వేసవి లో చాలా మంది ఊటీ వెళ్లారు. ఎంతో మందికి ఫేవరెట్ టూరిస్ట్ డెస్టినేషన్. వింటర్ లో కూడా చాలా మంది పర్యాటకులు ఊటీకి వెళ్తుంటారు. అందుకే ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజిలని తీసుకు వచ్చింది. తిరుపతి నుంచి ఊటీకి అల్టిమేట్ ఊటీ పేరు తో ఓ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. రైల్ టూర్ ఇది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలు ని ఇప్పుడు చూద్దాం.

ఊటీతో పాటు కూనూర్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు ఈ టూర్ ప్యాకేజీ లో భాగంగా చూసి వచ్చేయచ్చు. ప్రతీ మంగళవారం తిరుపతి నుంచి ఊటీకి ఈ టూర్ ప్యాకేజీ వుంది. ప్రతీ మంగళవారం తిరుపతిలో ప్రారంభం అవుతుంది ఈ ప్యాకేజీ. రాత్రి 11.50 గంటలకు తిరుపతిలో శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రీచ్ అవుతారు. తర్వాత పర్యాటకుల్ని ఊటీ తీసుకెళ్తారు. బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ చూడొచ్చు.

రాత్రికి ఊటీలో బస చేయాలి. దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ ని మూడవ రోజు చూడచ్చు. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్. కూనూర్‌లోని ప్రదేశాలని చూసి తిరిగి మళ్ళీ ఊటీ చేరుకోవాలి. రాత్రికి ఊటీ లో బస చేయాలి. ఐదో రోజు తిరుగు ప్రయాణం. ఊటీలో చెకౌట్ అయ్యి కొయంబత్తూర్ బయల్దేరాలి. సాయంత్రం 4.35 గంటలకు కొయంబత్తూర్‌లో రైలు ఎక్కితే అర్ధరాత్రి తిరుపతి వచ్చేస్తారు.

ఇక ఈ ప్యాకేజీ ధర విషయానికి వస్తే.. కంఫర్ట్, స్టాండర్డ్ ప్యాకేజీలు వున్నాయి. స్టాండర్డ్ ప్యాకేజీలో ఒకరికి ట్రిపుల్ షేరింగ్‌కు రూ.11,210, ట్విన్ షేరింగ్‌కు రూ.14,550, సింగిల్ షేరింగ్‌కు రూ.28,290 చెల్లించాలి. అదే కంఫర్ట్ ప్యాకేజీ అయితే ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,540, ట్విన్ షేరింగ్‌కు రూ.15,880, సింగిల్ షేరింగ్‌కు రూ.29,620 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version