మైనర్ బాలికలతో పోర్న్ వీడియోలు…తిరుపతి కీచకుడి అరెస్ట్…!

-

దేశంలో పోర్న్ వీడియోల వ్యాపారం ఆందోళన కలిగిస్తోంది. పోర్న్ సైట్ లను బ్యాన్ చేసినా కూడా నెట్టింట వాటికి చెక్ పెట్టలేక పోతున్నారు. మహిళలు, యువతుల తోనే కాకుండా కొంతమంది కీచకులు మైనర్ బాలికలతోనూ పోర్న్ వీడియోలు చిత్రీకరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దాంతో ఈ వ్యవహారం పై దేశ వ్యాప్తంగా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తిరుపతిలో మైనర్ బాలికల బలవంతపు సెక్స్ రాకెట్ ను అధికారులు బట్టబయలు చేసారు. బాలికలతో పోర్న్ వీడియోలను చిత్రీకరించి సొమ్ము చేసుకుంటున్న కీచకుడిని అరెస్ట్ చేశారు.

Porn videos case Tirupati

పిల్లల పోర్న్ వీడియోలు సోషియల్ మీడియాలో విక్రయిస్తున్నట్టు గా అధికారులు గుర్తించారు. నిందితుడు యశోదానగర్ కు చెందిన మోహనక్రిష్ణ గా అధికారులు గుర్తించారు. మొత్తం 14 రాష్ట్రాల్లో తిరుపతి నిందితుడితో పాటు 83మందిపై కేసులు నమోదు అయ్యాయి. ప్రత్సుతం సిబిఐ అదుపులో నిందితుడు ఉన్నాడు. ఇక తిరుపతిలో బాలిక పోర్న్ వీడియోలు తీస్తున్న నిందితుడు పట్టుబడటం కలకలం రేపుతోంది. దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్నదానిపై విచారణ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version