నోటిఫికేషన్ రాక ముందే… హుజరాబాద్ ఉప ఎన్నికలు వెడేక్కాయి. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు తమ ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కు ప్రొఫెసర్ కోదండరాం దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. హుజురాబాద్ ఎన్నికలో తాము కూడా పోటీ చేస్తామని కోదండరాం ఇవాళ ప్రకటించారు. అంతేకాదు… ఆగస్టు నెల చివరి లో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు కోదండరాం.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈ సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నికపై కీలక ప్రకటన చేశారు..బోనాల పండుగలో ప్రతి ఒక్కరికి కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని కోరారు.
తమ పార్టీ పై దుష్ప్రచారం చేస్తున్నారని…కొద్దీ రోజులు బీజేపీకి దగ్గరవుతున్నారు అని..తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇదంతా అధికార పార్టీ టీఆర్ఎస్ తో కుమ్మక్కై చేస్తున్న దుష్ప్రచారమని ఆయన ఫైర్ అయ్యారు. ఆస్తుల సంపాదన, పార్టీలో అంతర్గతంగా ఎవరిని సహించకపోవడం లాంటి వాటిపైన హుజురాబాద్ ఎన్నిక జరుగుతోందని…డబ్బు కుమ్మరించి గెలవాలనే తాపత్రయం ఉందని ఆయన చురకలు అంటించారు.