మళ్ళీ వాయిదా పడిన మమత మేనిఫెస్టో.. అందుకేనా ?

-

రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈరోజు తన మ్యానిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ రోజు విడుదల చేయాల్సిన ఎన్నికల మేనిఫెస్టో కార్యక్రమాన్ని టిఎంసి రద్దు చేసినట్లు చెబుతున్నారు. పార్టీ తన మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు నిన్న టిఎంసి వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ మేనిఫెస్టో కొన్ని రోజుల ముందే ప్రకటించాల్సి ఉంది, కానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం (మార్చి 11) నందిగ్రామ్‌లోని తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు గాయాలపాలయ్యారు.

దీంతో ఈ ఈవెంట్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఆమెను గుర్తు తెలియని కొద్దిమంది వ్యక్తులు నెట్టేసినట్లు సీఎం ఆరోపించారు. పలు గాయాల పాలైన తర్వాత, బెనర్జీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు, అనంతరం డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే నిజానికి ఆమె మీద ఎలాంటి దాడి జరగలేదని ఎన్నికల పరిశీలకులు కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే కౌంటర్ రెడీ చేసుకునేందుకు ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version