మీ పాదాలని అందంగా మార్చుకోవాలంటే.. ఇలా చేయండి..!

-

చాలామంది అందంగా కనిపించాలని అనుకుంటారు. అందుకోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు. ముఖ్యంగా పాదాలని అందంగా మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. పాదాలని అందంగా మార్చుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇలా చేశారంటే మీ పాదాలు ఎంతో బాగుంటాయి. మీ పాదాలు అందంగా మారాలంటే పాదాల మురికిని తొలగించడానికి ఇప్సమ్ సాల్ట్ బాగా పనిచేస్తుంది. దానిని మీరు ఉపయోగిస్తే మీ పాదాలు తెల్లగా అంతగా మారుతాయి.

నీళ్లలో ఇప్సమ్ సాల్ట్ వేసి మీరు మీ పాదాలని ఆ నీటిలో నానపెడితే మురికి మొత్తం పోతుంది కాంతివంతంగా మారుతాయి మీ పాదాలు. నిమ్మరసంలో కొంచెం తేనె కలిపి మాస్క్ తయారు చేసుకోండి దీనితో పాదాల్ని మసాజ్ చేస్తే పాదాలు తేమగా ఉంటాయి. అలానే మృదువుగా మారుతాయి అందంగా ఉంటాయి. పాలు, ఓట్స్, తేనె కలిపి అందులో మీ పాదాలని ఉంచుకోండి 10 నిమిషాల పాటు అలా ఉంచి ఆ తర్వాత పాదాలని శుభ్రంగా కడిగేసుకుంటే పాదాలు మృదువుగా మారతాయి.

పెప్పెర్మింట్ ఆయిల్ కూడా బాగా సహాయం చేస్తుంది. మీ పాదాలని పెప్పర్మెంట్ ఆయిల్ మృదువుగా కాంతివంతంగా మారుస్తుంది. కాబట్టి మీరు ఈ ఆయిల్ తో మసాజ్ చేసుకోవచ్చు అరటిపండుని గుజ్జు కింద చేసుకుని పాదాలకి మాస్క్ లాగ వేసుకోండి. ఇలా పాదాలని మాస్క్ వేసుకోవడం వలన కూడా ఈజీగా మీ పాదాలు అందంగా మారుతాయి. అలోవెరా జెల్ కూడా బాగా సహాయపడుతుంది. పెరుగు కూడా ఇందుకు బాగా హెల్ప్ అవుతుంది. పాదాల మీద పెరుగు రాసుకోవడం వలన కాంతివంతంగా మారుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version