నేడు ముచ్చింతల్‌లో 108 ఉత్స‌వ మూర్త‌ల‌కు శాంతి క‌ళ్యాణం

-

రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింత‌ల్ లోగ శ్రీ రామ న‌గ‌రంలో 216 అడుగుల స‌మతా మూర్తి రామానుజా చార్యుల భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆశ్ర‌మంలో దేశంలో ఉన్న 108 ప్ర‌ముఖ దేవాల‌యాల న‌మూనాల‌ను కూడా ప్ర‌తిష్టించారు. అంతే కాకుండా స‌మ‌తా మూర్తి స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల‌ను చిన్న జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో కూడా వైభ‌వంగా నిర్వ‌హించారు. స‌మతా మూర్తి స‌హ‌స్రాబ్ధి ఉత్స‌వాల‌కు దేశ వ్యాప్తంగా ప‌లువురు ప్రముఖులు కూడా వ‌చ్చారు.

దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, రాష్ట్ర ప‌తి రామ్ నాథ్ కొవింద్, ఉప రాష్ట్ర ప‌తి వెంక‌య్య నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్.. కూడా వ‌చ్చారు. 12 రోజుల పాటు జ‌రిగిన స‌మ‌తా మూర్తి స‌హ‌స్రాబ్ధి ఉత్స‌వాలు.. ఇటీవ‌ల ఘ‌నంగా ముగిశాయి. తాజా గా నేడు ఆశ్ర‌మంలో ఉన్న 108 ఉత్స‌వ మూర్తుల శాంతి క‌ళ్యాణాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే 108 ఉత్స‌వ మూర్తుల‌కు ప్రాణ ప్ర‌తిష్ట జ‌రిగింది. కానీ క‌ళ్యాణాన్ని నేటికి వాయిదా వేశారు. కాగ ఈ శాంతి కళ్యాణం నేడు సాయంత్రం 5 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version