తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శ్రీశైలం కూడా ఒక్కటి. కాగ ఈ పుణ్య క్షేత్రానికి నేడు దేశంలోని అత్యన్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ ఎన్.వి. రమణ రానున్నారు. నేడు సాయంత్రం 6 : 30 గంటలకు జస్టిస్ ఎన్.వి. రమణ.. శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు. సోమవారం ఉదయం శ్రీశైలం ఆలయంలో స్వామిని, అమ్మవార్లను జస్టిస్ ఎన్.వి. రమణ దర్శించుకుంటారు.
అనంతరం శ్రీశైలంలో జరిగే.. కల్యాణ ఉత్సవాల్లో జస్టిస్ ఎన్.వి. రమణ పాల్గొంటారు. కాగ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ.. శ్రీశైలం ఆలయానికి వస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జస్టిస్ ఎన్.వి. రమణ ఈ రోజు సాయంత్రం వచ్చి రాత్రి శ్రీశైలంలోనే బస చేయనున్నారు. దీంతో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. కాగ జస్టిస్ ఎన్.వి. రమణ తెలుగు వ్యక్తి కావడంతో తిరుమల తిరుపతి తో పాటు ఇతర ఆలయాలకు క్రమం తప్పకుండా వస్తుంటారు.