ఏపీలో భారీగా కేసులు నమోదు, ఒక్క రోజే 80…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. ప్రతీ రోజు 70 కేసులకు పైగా నమోదు కావడం ఇప్పుడు కంగారు పెట్టే అంశం. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కేసులు అతి వేగంగా నమోదు కావడం ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా భయపెడుతుంది. కృష్ణా జిల్లాలో రెండు రోజుల్లో దాదాపు వంద కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కేవలం 24 గంటల్లోనే కొత్తగా 80 కేసులు నమోదు అయ్యాయి.

మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 1177కు చేరింది. కరోనా నుంచి 235 మంది కోలుకున్నారు. కరోనా మరణాలు ఏమీ నమోదు కాలేదు. 31 మంది రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయారు. ఆస్పత్రుల్లో 911 మంది కరోనాతో పోరాటం చేస్తున్నారు. 24 గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షలు చేసారు.

గుంటూరులో 23, కృష్ణాలో 33, కర్నూలులో 13, నెల్లూరులో 7, శ్రీకాకుళంలో 1, పశ్చిమ గోదావరిలో 3 కేసులు పాజిటివ్ గా తేలాయి. కర్నూలు జిల్లాలో 292 కేసులు నమోదు కాగా రెండో స్థానంలో ఉన్న గుంటూరులో 237 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా 210 కేసులతో మూడో స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version